prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 12:16 pm Digital Edition : PRAJA VANI

గరిడేపల్లిలో ముమ్మరంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు

గరిడేపల్లిలో ముమ్మరంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు

50 శాతానికి పైగా నమోదు పూర్తి.. మరో రెండు రోజులు గడువు పొడిగింపు

సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ

గరిడేపల్లి, నవంబర్ 27 (ప్రజావాణి):

గరిడేపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ, గ్రామపంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో మూడు ప్రత్యేక కౌంటర్ల ద్వారా నమోదు ప్రక్రియ చేపట్టారు.

ఇప్పటివరకు 50 శాతానికి పైగా లబ్ధిదారుల నమోదు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా అర్హులైన వారు నమోదు చేసుకునేందుకు వీలుగా సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ ఆదేశాల మేరకు మరో రెండు రోజుల పాటు గడువు పొడిగించారు.

రేషన్ కార్డులో ఒంటరిగా నమోదై ఉండి, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ సూచించారు. అర్హులైన వారు గ్రామపంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావును సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆమె కోరారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ గడువులోగా నమోదు చేసుకోవాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.