prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 November 2026, 4:42 pm Digital Edition : PRAJA VANI

కాపుల కనపర్తి నూతన డైరెక్టర్ గోలి రవీందర్‌కు ఘన సన్మానం

కాపుల కనపర్తి నూతన డైరెక్టర్ గోలి రవీందర్‌కు ఘన సన్మానం

నవంబర్ 27.ప్రజావాణి న్యూస్ /సంగెం

సంగెం మండలం కాపులకనపర్తి నూతనంగా ఎన్నుకోబడిన డైరెక్టర్ గోలి రవీందర్ ని గ్రామంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సదయ,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కందకట్ల నరహరి, మార్కెట్ డైరెక్టర్ అచ్చ నాగరాజు,మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కోడూరి శ్రీనివాస్, గ్రామ పార్టీ అధ్యక్షులు రావుల రామకృష్ణ, వార్డ్ మెంబర్లు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.అందరూ కలిసి గోలి రవీందర్ కి శాలువాతో సత్కారం చేసి, పూలమాల వేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గోలి రవీందర్ రైతుల సమస్యల పరిష్కారానికి,గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షించారు.గ్రామ ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.