ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలి
గ్రామ సర్పంచ్ శనిగరం సత్యనారాయణ
మద్దూరు నవంబర్27, ప్రజా వాణి,
నర్సాయపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో మద్దూరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, సర్పంచ్ శనిగరం.సత్యనారాయణ ఆధ్వర్యంలో….ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో మద్దూరు మండల ఎంపీడీఓ సి హెచ్ శ్రీనివాస్ పాల్గొని 18-59 వయస్సు గల వారందరూ భీమా చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించి సందేహాలను నివృత్తి చేశారు.ఈకార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు ముస్తాల.గీత మరియు తుమ్మల.శ్రీను మరియు పంచాయతీ కార్యదర్శి భాస్కర్,గ్రామ పరిపాలన అధికారి రవి మరియు గ్రామ ప్రజలు,సిబ్బంది పాల్గొన్నారు.