*అయ్యప్ప గుడికి విరాళం*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
చండూర్ లో అయ్యప్ప గుడి నిర్మాణానికి చామలపల్లి మాజీ ఎంపీటీసీ నల్లగొండ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు నేర్లకంటి రవికుమార్ సాగర్ తండ్రి జంగయ్య 51,116 /- రూపాయల విరాళంను అయ్యప్ప దేవాలయ కమిటీకి అందజేశారు. వారికీ వారి కుటుంబానికి ఆ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చారు. ఈ సందర్బంగా చండూర్ మున్సిపల్ చైర్మన్ మరియు అయ్యప్ప దేవాలయ కమిటీ చైర్మన్ కోడి శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి వెంకన్న, బొమ్మరబోయిన వెంకటేశం గురుస్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ బోర్డు మెంబెర్ కోలుగురి అమృత కేసరి సాగర్, మాజీ కౌన్సిలర్ మంచుకొండ సంజయ్, పన్నాల లింగయ్య, కారింగు రామ్మూర్తి, సరికొండ వెంకన్న, వేద పండితులు చిలివేరు ప్రవీణ్ శర్మ, మర్ల రమేష్, రాసాల ఆంజనేయులు, నేర్లకంటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.