అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలి: పోచారం సీఐ డాక్టర్ జగన్నాథ్…. అన్నోజిగూడలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. విద్యార్థులకు మినీ రాజ్యాంగ పుస్తకాల పంపిణీ…
ఘట్కేసర్, నవంబర్ 27: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తెలంగాణ అంబేద్కర్ సంఘం పోచారం డివిజన్ అధ్యక్షుడు మోటుపల్లి ప్రదీప్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోచారం సీఐ డాక్టర్ జగన్నాథ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రతాపరెడ్డి, మంద విజయ్ కుమార్ వయమా ఉపాధ్యాయులు, రామ్ దాస్, భాషయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రచయిత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి, విద్యార్థులకు మినీ...