ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఎన్నికల నిబంధనలను గౌరవించండి!ఓట్ల లెక్కింపులో గెలుపొందిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారు సిద్ధమూర్తి లక్ష్మీదేవికి డిక్లరేషన్ ఫారం అందజేయాలి

ఆర్డీవోను కోరిన ఎమ్మెల్సీ డి.సి గోవిందరెడ్డి.రాత్రి 7 నుంచి 10 గంటల వరకు కౌంటింగ్ కేంద్రం వద్దే ఉండి అధికారులతో చర్చలు బి.కోడూరు:నవంబర్ 26ప్రజావాణి ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, ఎన్నికల ప్రక్రియలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎమ్మెల్సీ డి.సి.గోవిందరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకుండా, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని బి.కోడూరు మండలంలోని పెద్దులపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల అధికారులను ఆయన కోరారు.ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఎన్నికల అధికారి ప్రకటించిన ఫలితాన్ని గౌరవించి, ప్రజాస్వామ్యబద్ధంగా విజయం...