సిద్దవరం పంచాయతీలో తెలుగుదేశం విజయభేరి: 134 ఓట్ల భారీ మెజారిటీతో దూసుకెళ్లిన జి.ఈశ్వర్ రెడ్డి!

పోరుమామిళ్ల (కడప జిల్లా)నవంబర్ 26ప్రజావాణి వైఎస్ఆర్ కడప జిల్లా రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా స్థానిక పోరు రసవత్తరంగా సాగింది.జిల్లాలోని కీలకమైన పోరుమామిళ్ల మండలంలో ఉన్న సిద్దవరం పంచాయతీ ఎన్నికల ఫలితం ఉత్కంఠకు తెరదించుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. సిద్దవరం పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు బలపరిచిన అభ్యర్థి జి. ఈశ్వర్ రెడ్డి ఘన విజయం సాధించారు.తన సమీప ప్రత్యర్థిపై ఏకంగా 134 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి,సిద్దవరం గడ్డపై పసుపు జెండాను ఎగురవేశారు.ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల...