కొండ్రాజుపల్లి పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఏకపక్ష విజయం: 281 ఓట్ల భారీ మెజార్టీతో సర్పంచ్‌గా నల్లేరు చంద్రశేఖర్ రెడ్డి ఘన విజయం.10కి 10 వార్డులు క్లీన్ స్వీప్!

అవధూత కాశినాయన (వైఎస్సార్ జిల్లా):నవంబర్26ప్రజావాణి అవధూత కాశినాయన మండల పరిధిలోని కొండ్రాజుపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. బద్వేల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ రెడ్డి దిశానిర్దేశంలో పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నల్లేరు చంద్రశేఖర్ రెడ్డి 281 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.వార్డుల్లోనూ తిరుగులేని ఆధిక్యం..10కి 10 క్లీన్ స్వీప్!సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా,గ్రామంలోని మొత్తం 10 వార్డు స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే ఘన విజయం...