హనుమకొండలో 25 మంది వెట్టిచాకిరీ కార్మికులకు విముక్తి
హనుమకొండలో 25 మంది వెట్టిచాకిరీ కార్మికులకు విముక్తి కలెక్టర్ ఆదేశాలతో అధికారుల మెరుపు తనిఖీలు.. తొమ్మిది మంది చిన్నారులకు విముక్తి ప్రజావాణి నవంబర్ 26 హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో వెట్టిచాకిరీ వ్యవస్థలో మగ్గుతున్న 25 మంది కార్మికులకు జిల్లా కలెక్టర్ తక్షణ జోక్యంతో విముక్తి లభించింది. వీరిలో తొమ్మిది మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సిమెంట్ రింగులు, ఇటుకల తయారీ కేంద్రాల్లో దాదాపు 10 నుంచి 14 సంవత్సరాలుగా అప్పుల పేరుతో కార్మికులను బలవంతంగా పనిలో పెట్టుకున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది...