సేవే పరమావధిగా లయన్స్ క్లబ్, నీర్మాల స్మశానవాటికలో షెడ్ ప్రారంభం

జనగామ ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):జిల్లాలోని దేవరుప్పుల మండలం, నీర్మాల గ్రామంలోని స్మశానవాటికలో షెడ్ ను లయన్ యాడ్మా సంజీవరెడ్డి - సుగుణ దంపతుల దాతృత్వంతో వారి తల్లిదండ్రుల పేరిట నిర్మించారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చేసిన ఈ సేవా కార్యక్రమం గ్రామస్తులందరి మన్ననలు పొందింది. నిర్మించిన షెడ్ ను లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నరహరి సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు సంజీవరెడ్డి - సుగుణ దంపతుల సేవా భావాన్ని కొనియాడారు....