prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 4:06 pm Digital Edition : PRAJA VANI

సుందరయ్య నగర్ కాలనీ శ్రీరామ్నగర్ కాలనీ లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు విస్తృత ప్రచారం

సుందరయ్య నగర్ కాలనీ శ్రీరామ్నగర్ కాలనీ లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు విస్తృత ప్రచారం
మన ప్రజావాణి. ( నవంబర్ 26)
ఎటపాక మండలం

ఎట పాక మండలం. పురుషోత్తపట్నం గ్రామపంచాయతీ వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి సోడె నాగరత్నం గారి అదేవిధంగా వార్డు మెంబర్లు విజయాన్ని కాంక్షిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ఆర్సిపి గ్రామ కమిటీ
ఈనెల 29వ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికలలో పురుషోత్తపట్నం గ్రామపంచాయతీ లో, సుందరయ్య నగర్, శ్రీరామ్ నగర్ కాలనీలో, వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థినిగా పోటీ చేయుచున్న శ్రీమతి సోడే నాగరత్నం గారి ఉంగరం గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారం నిర్వహించిన పురుషోత్తపట్నం గ్రామ కమిటీ ఈ ప్రచారంలో పురుషోత్తపట్నం గ్రామ ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించడంతోపాటు అన్ని వార్డులను గెలిచేదిశగా పురుషోత్తపట్నం పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమంలో సర్పంచ్ మరియు అన్ని వార్డుల మెంబర్లు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు