జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):హైదరాబాద్ లోని సిక్ విలేజ్ గాయత్రి ఫంక్షన్ హాల్ లో మాజీ జెడ్పీటీసీ జల్లి సిద్ధయ్య సోదరుడి కుమారుడి వివాహ వేడుక గురువారం ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన దంపతుల వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. పెద్దలను గౌరవిస్తూ, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి అన్యోన్యంగా జీవించాలని సూచించారు. కుటుంబ పెద్దలకు, బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వివాహ వేడుకలో స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.