సర్పంచ్ సంగ రమేష్ ఆధ్వర్యంలో నూతన పింఛన్ పత్రాల పంపిణీ
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు, ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో సర్పంచ్ సంగ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని సర్పంచ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మెరుగు జంపయ్య జానీ, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి రమేష్, పంచాయతీ కార్యదర్శి దాసరి మల్లేశం, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.