సరోత్తమ్ రెడ్డి సమావేశానికి ఇనుగుర్తి మండల కాంగ్రెస్ నేతలు..
ప్రజావాణి,ఇనుగుర్తి: వరంగల్,నల్గొండ,ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్ రెడ్డి సరోత్తమ్ రెడ్డి గెలుపు కోసం డిసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ తో పాటు మండల నాయకులు వివిధ గ్రామాల సర్పంచులు తరలి వెళ్లారు.సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అశోక్ గౌడ్ మాట్లాడుతూ సరో త్తమ్ రెడ్డి దశాబ్దాలుగా ప్రజాసేవలో కొనసాగిన కుటుంబం నుంచి వచ్చిన విద్యాధికులు, సేవా భావం కలిగిన యువ నాయకులు,అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో గెలుపు ఖాయమని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్, డిసిసి అధ్యక్షులు ఉమా మురళి నాయక్ స్పష్టం చేసినట్లు తెలిపారు.పట్టభద్రులు,ఉద్యోగుల సమస్యల పై అవగాహన కలిగిన తనకు కట్టబద్రలతో పాటు ఉద్యోగులు మద్దతు పలకాలని చట్టసభల్లో సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని తెలిపినట్లు అశోక్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సరోత్తమ్ రెడ్డి ఇనుగుర్తి మండల నాయకులు ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్సీ ఎలక్షన్ పై ఆరాతీసినట్లు అశోక్ గౌడ్ తెలిపారు. మానుకోటకు తరలిన వారిలో ఇనుగుర్తి పట్టణ అధ్యక్షులు గంజి రాజేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ మండల నాయకులు గ్రామ శాఖల అధ్యక్షులు ఉన్నట్లు ఆయన తెలిపారు.