prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 4:13 pm Digital Edition : PRAJA VANI

రాజ్యాంగ విలువల పరిరక్షణే లక్ష్యం.. అంబేద్కర్ ఆశయ సాధనే బీజేపీ ధ్యేయం

**రాజ్యాంగ విలువల పరిరక్షణే లక్ష్యం.. అంబేద్కర్ ఆశయ సాధనే బీజేపీ ధ్యేయం**

వరంగల్, నవంబర్ 26:
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్‌లో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మదాసు రాజు ఆధ్వర్యంలో పోచమ్మ మైదానం నుంచి కాశీబుగ్గ అంబేద్కర్ సెంటర్ వరకు చైతన్య ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర నాయకులు చింతం సాంబమూర్తి, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, దళిత బహుజన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. అంబేద్కర్‌ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శిస్తూ, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, ఎస్సీ మోర్చా నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.