*రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత – మాజీ ఎమ్మెల్యే మెచ్చా*
ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 26
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో డా. బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కల్పించిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలవడానికి రాజ్యాంగం పునాది అని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు ప్రతి పౌరుడు తన బాధ్యతలను కూడా గుర్తుంచుకోవాలని, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం విలువలను ఆచరణలో పెట్టాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మండల బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ జూపల్లి రమణారావు,మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, మోహన్ రెడ్డి,మాజీ సర్పంచ్లు నారం రాజ్ శేఖర్, సాధు జ్యోత్స్న బాయి, కలపాల బాబురావు,ఆరేపల్లి రాంబాబు,సంకుల స్వరూపా,నందికొల్ల వెంకన్న,ధర్మ,చిప్పనపల్లి శ్రీను,బన్ను, సంతోష్,అమీర్. తదితరులు పాల్గొన్నారు,