prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 12:53 pm Digital Edition : PRAJA VANI

రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి తరలివెళ్లిన కూసుమంచి మండల కాంగ్రెస్ నాయకులు

రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి తరలివెళ్లిన కూసుమంచి మండల కాంగ్రెస్ నాయకులు
హైదరాబాద్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొనేందుకు పయనం
కూసుమంచి నవంబర్ 26 (మన ప్రజావాణి) ప్రతినిధి: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనల మేరకు, ఏఐసీసీ పిలుపుతో టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొనేందుకు కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించాలనే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని రాజ్యాంగ పరిరక్షణకు తమ సంఘీభావాన్ని తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు.