prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 10:43 am Digital Edition : PRAJA VANI

మాదారం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – ట్రాక్టర్ డ్రైవర్ మృతి

మాదారం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం – ట్రాక్టర్ డ్రైవర్ మృతి
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మాదారం సమీపంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
వెనుక నుంచి వేగంగా వస్తున్న అశోక్ లేలాండ్ ట్రాలీ వాహనం, ముందు వెళ్తున్న ట్రాక్టర్ ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ తీవ్రంగా ధ్వంసమై, అందులో డ్రైవింగ్ చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాద తీవ్రతకు ట్రాలీ వాహనం సైతం అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ నుజ్జునుజ్జయినట్లు తెలుస్తోంది.
ట్రాలీ డ్రైవర్ పరిస్థితి, ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.