prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 4:32 pm Digital Edition : PRAJA VANI

మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రూపిరెడ్డి ఆదిరెడ్డి

మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రూపిరెడ్డి ఆదిరెడ్డి

రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నియామకంపై అభినందనలు తెలిపి శాలువాతో సత్కారం

ఓదెల పెద్దపల్లి ప్రజావాణి ప్రతినిధి

కరీంనగర్: ఇటీవల భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా నియమితులైన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన రూపిరెడ్డి ఆదిరెడ్డి, గురువారం కరీంనగర్‌లోని గౌరవ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీ గుజ్జుల రామకృష్ణారెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆశీర్వాదం తీసుకొని, తనకు లభించిన నూతన బాధ్యతల గురించి వివరించారు.

రూపిరెడ్డి ఆదిరెడ్డికి ఇటీవల బీజేపీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా బాధ్యతలు లభించిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా రూపిరెడ్డి ఆదిరెడ్డి మాట్లాడుతూ తనకు రాష్ట్ర స్థాయిలో పార్టీ బాధ్యతలు లభించడం సంతోషంగా ఉందని, పార్టీ నాయకులు, సీనియర్ల ఆశీస్సులు, సహకారంతో ప్రజలకు, పార్టీకి మరింత సేవ చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఈ మర్యాదపూర్వక భేటీలో ధర్మపురి నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి శ్రీ కన్నం అంజన్న, బీజేవైఎం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు గంటల రమణారెడ్డి, బీజేవైఎం పెద్దపల్లి జిల్లా మాజీ కార్యదర్శి పుల్లూరి పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.