మహిళకు సురక్షితమైన వాతావరణం లేని అభివృద్ధి నిజమైన అభివృద్ధే కాదు

మహిళకు సురక్షితమైన వాతావరణం లేని అభివృద్ధి నిజమైన అభివృద్ధే కాదు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 25 అమరావతి అన్ని రంగాల్లో మహిళలు ముందు వరుసలో ఉన్నప్పటికీ ఇప్పటికీ పురుషులే వ్యవస్థను నడిపిస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా నవంబర్ 25న నిర్వహించే మహిళలపై హింస నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్, ధర్మపీఠం సంయుక్త ఆధ్వర్యంలో...