మద్దూర్ జూనియర్ కళాశాల లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
మద్దూరు నవంబర్26, ప్రజా వాణి,
మద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ చైర్మన్ & ప్రిన్సిపల్ సూచన మేరకు, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి. శ్రీనివాస్ విద్యార్థిని ,విద్యార్థుల చేత రాజ్యాంగ ప్రవేశిక “ప్రతిజ్ఞను” చేయించారు. మరియు రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం, అందిస్తూ ప్రాథమిక హక్కులను కల్పించిందన్నారు .మరియు హక్కులతో పాటు విధులను కూడా పాటించాలని సూచించింది. భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సుదీర్ఘమైన అతిపెద్ద ప్రజాస్వామ్య లిఖిత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు నిర్విరామంగా కృషిచేసి రచించడం జరిగిందన్నారు.ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 తారీఖున ఆమోదించడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగం భారతదేశ ప్రజలకి “హృదయం” లాంటిదని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థుల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.