*మంచిర్యాల శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన: సురేఖమ్మ పాల్గొన్న మహోత్సవం*
మంచిర్యాల,ప్రజావాణి రిపోర్టర్,నవంబర్ 26:
మంచిర్యాల పట్టణంలోని శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నూతన ఆలయ నిర్మాణానికి నిర్వహించిన శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, వేదోక్త విధానంలో శంకుస్థాపన మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి ఆశీర్వదించారు.
సుమారు రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పరమశివుడు, శ్రీ వాసవి మాత ఆలయాల నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పుర ప్రముఖుల కోరిక మేరకు, దేవాదాయ శాఖ ఆగమ శాస్త్ర నియమాలు, స్థపతుల సూచనల ప్రకారం ఉత్తర ముఖ ద్వారంతో నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
నూతన ఆలయ నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా పూర్తై, రానున్న గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు అందుబాటులోకి రావాలని సురేఖ ఆకాంక్షించారు. ఈ పవిత్ర ఆలయం భక్తులకు మరింత ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించాలని, ప్రజలందరిపై ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ముక్త రవి, ఆలయ అర్చకులు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పూదరి తిరుపతి, కొత్త రాజేశం, మంచిర్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అర్కాల హేమలత, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.