భారత దేశానికి రాజ్యాంగం శిరోధార్యం.
విద్యార్థులకు వ్యాస రచన పోటీలు
సలాకపురం గ్రామ సర్పంచ్ గడిపే మౌనిక అనిల్ కుమార్.
మద్దూరు నవంబర్26, ప్రజా వాణి,
మండలంలోని సలాకపురం గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలలో గ్రామ సర్పంచ్ గడిపే మౌనిక అనిల్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించి విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన గణతంత్ర రాజ్యం. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపమే మన రాజ్యాంగం. పౌరులు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించాల్సిన అత్యున్నత చట్టంగా దీన్ని పేర్కొంటారు. ఇందులో ప్రభుత్వ విభాగాలు వాటి స్వరూపం, స్వభావం, లక్ష్యాలు, ఆశయాలను వివరించారు. వ్యక్తి స్వేచ్ఛకు, సర్వతోముఖాభివృద్ధికి రాజ్యాంగం హామీ ఇస్తుంది. భారతదేశ ప్రజాస్వామ్య, లౌకిక, సమానత్వ భావనలను సూచించే ప్రాథమిక పత్రంలా ఇది పనిచేస్తుంది. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీకి గుర్తుగా ఏటా నవంబరు 26న ‘జాతీయ రాజ్యాంగ దినోత్సవం’గా నిర్వహిస్తారు. దీన్నే ‘సంవిధాన్ దివస్’ అనే పేరుతోనూ పిలుస్తారు. రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్న వారిని గౌరవించడం, రాజ్యాంగ సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.