విద్యార్థులతో రాజ్యాంగ పీఠిక చదివించి ప్రతిజ్ఞ చేయించిన ఉపాధ్యాయులు
బెజ్జంకి,నవంబర్ 26(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భారత రాజ్యాంగ గొప్పతనం, రాజ్యాంగంలోని హక్కులు, విధులు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించారు.అనంతరం విద్యార్థులతో రాజ్యాంగ పీఠికను చదివించి ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, ప్రజాస్వామ్య విలువలను పాటించాలని ఉపాధ్యాయులు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నారోజు శంకరాచారి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.