prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 4:26 pm Digital Edition : PRAJA VANI

బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఉకే సునీతగారి గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం

బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి ఉకే సునీతగారి గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం

సర్పంచ్ అభ్యర్థి ఉకే సునీత గారి విజయానికి కృషి చేస్తున్న టీడీపీ నాయకులు

మన ప్రజావాణి.( నవంబర్ 26) ఎటపాక మండలం

బీజేపీ, జనసేన పార్టీలు బలపరుస్తున్న తెలుగుదేశం పార్టీ ఎటపాక. సర్పంచ్ అభ్యర్థి ఉకే సునీత గారి గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ, అభ్యర్థి ఉకే సునీత గారికి మద్దతుగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

గ్రామ సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా సునీత గారు ముందుకు సాగుతున్నారని నాయకులు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్‌గా విజయం సాధించి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటూ సర్పంచ్ అభ్యర్థి ఉకే సునీత గారి విజయానికి కృషి చేస్తున్నారు.