prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 5:37 pm Digital Edition : PRAJA VANI

బావుసాయిపేట గ్రామ సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా గారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు చిరు ప్రోత్సాహం

*బావుసాయిపేట గ్రామ సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా గారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు చిరు ప్రోత్సాహం*

నవంబర్ 26 మన సమగ్ర ప్రజావాణి ప్రతినిధి కోనరావుపేట :

కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా గారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లకు చేతి గ్లౌజులు, బెల్లం, కొబ్బరి నూనె, టవల్స్, సబ్బులు అందజేయడం జరిగింది.
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, కంపోస్ట్ షెడ్ వద్ద చెత్తను వేరు చేసే పనులతో పాటు గ్రామ పారిశుధ్యంలో నిరంతరం కష్టపడుతున్న కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, వారి ఆరోగ్య రక్షణ మరియు వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఈ వస్తువులను అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాధిక గారు, నక్క ఎల్లయ్య గారు, వార్డు సభ్యులు కలిసి కార్మికులకు వస్తువులను అందజేశారు.
గ్రామ పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి. గ్రామాన్ని శుభ్రంగా ఉంచే వారి ఆరోగ్యం, భద్రత పట్ల శ్రద్ధ చూపడం మన బాధ్యతగా భావించి ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించామని సర్పంచ్ మరియు కార్యదర్శి గారు తెలిపారు.