prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 4:19 pm Digital Edition : PRAJA VANI

ప్రమాద బాధిత కుటుంబానికి జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత

ప్రమాద బాధిత కుటుంబానికి జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత

మంగపేట, నవంబర్ 26 (ప్రజావాణి):

ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన ఇందారపు చందు లక్ష్మి కుటుంబం గ్యాస్ సిలిండర్ పేలుడుతో జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వస్వం కోల్పోయింది.ఈ విషయం తెలుసుకున్న జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ట్రస్ట్ తరఫున రూ.5,116 ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. ఆపద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం పట్ల స్థానికులు ట్రస్ట్ సభ్యులను అభినందించారు. తమ కష్టకాలంలో సహాయం అందించిన ట్రస్ట్ ప్రతినిధులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జ్వాలా ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్, ప్రధాన కార్యదర్శి బండపల్లి రవి గౌడ్, ఉపాధ్యక్షులు ఎర్రంగారి వీరన్, ప్రచార కార్యదర్శులు గగ్గురి మహేష్, మహ్మద్ ఖాజా, ముప్పారపు రాజు, గౌరవ సలహాదారు ఓదెల సుధీర్ తదితర ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.