ప్రభుత్వ పాఠశాలలోచదువుకో తెలంగాణ పోస్టర్ ఆవిష్కరణ
* ఎంఈఓ రాములు నాయక్
* ఎస్సై క్రాంతికుమార్
* జమ్మికుంట డివిజన్ శ్రీరామ్ లైఫ్ డివిజనల్ మేనేజర్ సతీష్, మేనేజర్ రాము
* హుజురాబాద్ మేనేజర్ రాజేష్ కన్నా
జమ్మికుంట నవంబర్ 26 (ప్రజావాణి)
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలోచదువుకో తెలంగాణ కార్యక్రమంలో భాగంగా 2025-2026 విద్యా సంవత్సరానికి గాను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు నిర్వహించిన కాంటెస్ట్ లో ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి తిప్పరబోయిన రితీష్ విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా సదరు విద్యార్థిని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు గురువారం పాఠశాలలో ఘనంగా సత్కరించారుమండల టాపర్‌గా నిలిచిన తిప్పరబోయిన రితీష్ కి రూ. 10 వేల నగదు బహుమతి చెక్కును అందజేసివరంగల్ జోన్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ జమ్మికుంట బ్రాంచ్ వారు
అభినందించారు విద్య సంవత్సరానికి సంబంధించిన ‘చదువుకో తెలంగాణ బడ్జెట్ పోస్టర్‌ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారుకార్యక్రమంలో ఎంఈఓ రాములు నాయక్ ఆ పాఠశాలప్రధానోపాధ్యాయురాలు టస్నీమ్, ఇల్లంతకుంట మండల ఎస్సై క్రాంతికుమార్ జమ్మికుంట డివిజన్ శ్రీరామ్ లైఫ్ డివిజనల్ మేనేజర్ సతీష్, మేనేజర్ రాము,హుజురాబాద్ మేనేజర్ రాజేష్ కన్నా ఉద్యోగులు సాయిసుకుమార్ రాకేష్, ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు