పడంపల్లి పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
విద్యార్థులకు ఈజీ లెర్నింగ్ ప్యాడ్స్ పంపిణీ..
ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీడీవో శ్రీనివాస్
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 26
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పడంపల్లి గ్రామ పాఠశాలలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో భారత రాజ్యాంగ పీఠికను (ప్రవేశిక) చదివించి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధులు, ప్రజాస్వామ్య విలువల గురించి విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో హాజరయ్యారు. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, వార్డు సభ్యులు , గ్రామ పెద్దలు మరియు ప్రజలు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగలగాం గ్రామానికి చెందిన కాంబ్లె మిలింద్ పెద్ద ఏడ్గీ గ్రామానికి చెందిన వాగ్మారే ఖండెరావు పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే ఈజీ లెర్నింగ్ ప్యాడ్స్‌ను అందజేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు దాతలు చేసిన సహకారాన్ని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
అనంతరం పడంపల్లి గ్రామంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి సంబంధించిన కార్యక్రమం కూడా నిర్వహించారు.దరఖాస్తులు స్వీకరించడం జరిగింది
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.