కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఈరోజు జరిగిన పలు వివాహ వేడుకల్లో పొనుగోటి శ్రీనివాసరావు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. కరీంనగర్‌లోని వసుధా ఫంక్షన్ హాల్లో మద్దుల గోపాల్ రెడ్డి కుమార్తె ఇందుజా రెడ్డి-రిత్విక్ రెడ్డి వివాహానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి హాజరయ్యారు. అలాగే మైత్రి కన్వెన్షన్ హాల్లో సాక్షి రిపోర్టర్ సురేందర్ రెడ్డి కుమారుడు అభిలాష్ రెడ్డి-సిరి, జగిత్యాలలోని విరుపాక్ష గార్డెన్స్‌లో గోళి రమేష్ కుమార్తె శ్రావణి-సాయి అఖిలేంద్ర వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.