prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 7:29 am Digital Edition : UPENDHAR JANAGON

తొర్రూర్ లో ఉచిత ENT వైద్య శిబిరం తాత్కాలికంగా వాయిదా..

 

తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తాం – HRJR ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26: HRJR ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, Shravana Society of Hearing Rehabilitation (SHR), CARE Hospitals వారి సహకారంతో తొర్రూరు పట్టణంలోని ZPHS పాఠశాలలో 2026 నవంబర్ 29న నిర్వహించ తలపెట్టిన మెగా ఉచిత ENT వైద్య శిబిరం అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా వాయిదా వేయబడింది.

ఈ విషయాన్ని ట్రస్ట్ నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైద్య శిబిరానికి సంబంధించిన తదుపరి తేదీని త్వరలో ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు.

కావున పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మరియు సంబంధిత ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించగలరని విజ్ఞప్తి చేశారు. తదుపరి తేదీ ప్రకటించిన వెంటనే తెలియజేయడం జరుగుతుందన్నారు.