ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ లేక గేద మృతి.
మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంతని మండలం సిరిపురం గ్రామపంచాయతీ పరిధిలో విద్యుత్ షాక్కు గురై ఒక గేదే మృతి చెందింది గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ పా ర్మర్ చుట్టూ ఎలాంటి రక్షణ కంచే లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు ట్రాన్స్ పార్మర్ చుట్టూ రక్షణ ఏర్పాట్లు లేకపోవడం వల్ల పశువులు గేదెలు ప్రమాదాల గురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే గేద మృతి చెందడంతో యజమాని కి ఆర్థిక నష్టం వాటిల్లింది చనిపోయిన గేదె విలువ దాదాపు 80 వేల రూపాయలు ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు సంబంధిత విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ కంచే ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు అంటున్నారు