ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 25: జిల్లా లోని లింగాలగణపురం మండలం, జీడికల్ గ్రామంలోని శ్రీ వీరాచల జీడికంటి రామచంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య, స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి, మాజీ జడ్పీటీసీ సభ్యులు, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గుడి వంశీధర్ రెడ్డి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి కొంతసేపు గడిపి, బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.
అనంతరం ఆలయ నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. నూతన కమిటీ చైర్మన్ గా నెల్లుట్ల గ్రామానికి చెందిన గుర్రం బాలరాజు గౌడ్ ను ఎన్నుకున్నారు.. నూతనంగా ఎన్నికైన ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులకు ఎంపీ, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలకు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొండబోయిన మమత సంపత్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు సాదం మనోహర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శివ కుమార్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు నర్సింగ రామకృష్ణ, పార్టీ శ్రేణులు, ఆయా శాఖల అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.