జనగామ ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):జనగామ మున్సిపాలిటీ పరిధిలోని ROB (రైల్వే ఓవర్ బ్రిడ్జి) పై పేరుకుపోయిన దుమ్ము, ధూళి మరియు ఇతర వ్యర్థాలను తొలగించేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్కై లిఫ్టర్ వాహనాన్ని వినియోగించి ROB బ్రిడ్జి పైభాగాలు, గోడలు మరియు పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఆధునిక యంత్ర పరికరాల సహాయంతో ఎత్తైన ప్రాంతాల్లో కూడా సమర్థవంతంగా శుభ్రత పనులు చేపట్టారు.
ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ
పట్టణ ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు నగర సుందరీకరణలో భాగంగా ఇటువంటి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నట్లు జనగామ మున్సిపల్ కమిషనర్ సిఎచ్. రాజశేఖర్ తెలిపారు.