చింతలచెరువు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం: 729 ఓట్ల భారీ మెజారిటీతో సర్పంచ్‌గా లావణ్య విజయం.. డీసీ గోవిందరెడ్డి, దేవసాని ఆదిత్యరెడ్డిల వ్యూహం ఫలించింది

బద్వేల్,కడప జిల్లా:నవంబర్ 26ప్రజావాణి కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) తన హవాను చాటుకుంది.బద్వేల్ మండల పరిధిలోని చింతలచెరువు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని ఘన విజయం సాధించారు.వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు,ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి,యువనేత దేవసాని ఆదిత్య రెడ్డి సంయుక్తంగా బలపరిచిన అభ్యర్థి,నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సతీమణి లావణ్య ప్రత్యర్థిపై 729 ఓట్ల భారీ మెజారిటీతో తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు.ఈ ఏకపక్ష విజయం బద్వేల్ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త...