గ్రామ స్వరాజ్యానికి దిక్సూచి… ప్రజాస్వామ్యానికి పునాది మన రాజ్యాంగం

గ్రామ స్వరాజ్యానికి దిక్సూచి... ప్రజాస్వామ్యానికి పునాది మన రాజ్యాంగం! రాజ్యాంగమే సామాన్యులకు ఆత్మగౌరవం.. మహిళలకు సమాన హక్కులు.. పల్లెల అభివృద్ధికి అసలైన బలం! రాజ్యాంగం అంటే కేవలం చట్టాలు, నిబంధనలతో కూడిన పుస్తకం మాత్రమే కాదు. అది ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి ప్రతీక, సమానత్వానికి నిదర్శనం, స్వేచ్ఛకు భరోసా, ప్రజాస్వామ్యానికి పునాది. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవంగా జీవించే అవకాశాలు కల్పిస్తూ సమాజంలోని అన్ని వర్గాలకు దిశానిర్దేశం చేస్తున్న మహోన్నత మార్గదర్శి మన భారత రాజ్యాంగం. నా దృష్టిలో రాజ్యాంగం అనేది...