కార్తీక సోమవారం వేళ కూకట్పల్లి అయ్యప్ప దేవస్థానంలో పడి పూజ మహోత్సవం వైభవం
కార్తీక సోమవారం వేళ కూకట్పల్లి అయ్యప్ప దేవస్థానంలో పడి పూజ మహోత్సవం వైభవం! ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ప్రత్యేక హాజరు – అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన ఆలయం కూకట్పల్లి, నవంబర్ 26 (ప్రజావాణి): కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి శ్రీ అయ్యప్ప దేవస్థానంలో పడి పూజ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, అయ్యప్ప స్వాముల భజనలు, శరణుఘోషలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. రాహుల్ స్వామి, కార్తీక్ స్వాముల ఆధ్వర్యంలో...