నియామక పత్రం అందజేసిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 25: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధిగా నెల్లుట్ల గ్రామానికి చెందిన కోండ్ర ప్రవీణ్ ను నియమిస్తూ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ వేముల మల్లేశ్ మహారాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం వెంటనే అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య కోండ్ర ప్రవీణ్ కు నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఎంతో కాలంగా సేవలందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన యువ నాయకుడు కోండ్ర ప్రవీణ్ కు జిల్లా స్థాయిలో సముచిత స్థానం లభించినందుకు పలువురు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కోండ్ర ప్రవీణ్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి, అభివృద్ధికి మరింత కృషి చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు, ముఖ్యంగా డీసీసీ జనగామ జిల్లా అధ్యక్షురాలు లకవత్ ధన్వంతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుడి వంశీధర్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నెల్లుట్ల గ్రామ సర్పంచ్ నరసింగ రామకృష్ణ, వార్డు మెంబర్లు, నూతన జీడికల్ దేవస్థాన చైర్మన్ గుర్రం బాలరాజు గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తిని అశోక్ కుమార్ గౌడ్, జగ్గం ఆనంద్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.