ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
కోదాడ నవంబర్ 26,ప్రజావాణి : కోదాడలోని ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో జోనల్ ఇన్చార్జి స్నేహలత ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జోనల్ ఇన్చార్జి స్నేహలత మాట్లాడుతూ భారత రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. భారత రాజ్యాంగం మన దేశ ప్రజాస్వామ్యానికి దిక్సూచి అని, ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ,న్యాయం కల్పిస్తూ దేశ సమగ్రతకు బలమైన పునాదిగా భారత రాజ్యాంగం నిలుస్తుందని అన్నారు. ప్రిన్సిపాల్ పుల్లయ్య మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి పౌరుడు తెలుసుకోవడంతో పాటుగా మన బాధ్యతలను కూడా తెలుసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులచే మాక్ అసెంబ్లీ నిర్వహించి, దాని ప్రత్యేకతను సోషల్ ఉపాధ్యాయురాలు జ్యోతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.