**ఎమ్మెల్సీ అభ్యర్థి పాల్వాయి సర్వోత్తమ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వేలేరు కాంగ్రెస్ నాయకులు!**
రఘునాథ్‌పల్లి, నవంబర్ 25:
రఘునాథ్‌పల్లి మండలం నిడిగొండ గ్రామంలోని సత్యసాయి కన్వెన్షన్ హాల్‌లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి హాజరైన వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పాల్వాయి సర్వోత్తమ్ రెడ్డి గారిని వేలేరు గ్రామ శాఖ అధ్యక్షుడు అత్తెన రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వేలేరు మండల ప్రధాన కార్యదర్శి తూముల ప్రశాంత్, మండల మైనార్టీ అధ్యక్షుడు ఎస్.కె. పాషా, మండల ఉపాధ్యక్షుడు బొల్లికొండ రాజు, యువ నాయకులు ముడేపు రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకుంటూ పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై తమ ఐక్యతను చాటుకున్నారు.