ఎంపీడీవో ఆఫీసులో రాజ్యాంగ దినోత్సవం..
ప్రజావాణి,నెల్లికుదురు: భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుకు గుర్తుగా మండల కేంద్రం నెల్లికుదురు ఎంపీడీవో ఆఫీసులో భారత రాజ్యాంగ దినోత్సవం ఎంపీడీవో సింగారపు కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ప్రతిజ్ఞ చేశారు.అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ
భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం,హక్కులు అందించడానికి
రూపొందించ బడిందన్నారు.దేశ పౌరులందరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఎందుకు లోబడి వ్యవహరించాలని సూచించారు. క్రమంలో దుర్గ భవాని తండా సర్పంచి వీరన్న నాయక్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు మదన్ లాల్, సూపరిండెంట్ నరసింహ రావు, ఈ బిజీ రాంజీ ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.