prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 4:17 pm Digital Edition : PRAJA VANI

ఆలేరులో అంగన్వాడి తొలిముద్ద ప్రారంభం..

ఆలేరులో అంగన్వాడి తొలిముద్ద ప్రారంభం..
ప్రజావాణి,నెల్లికుదురు: పిల్లలకు పోషకాహారం అందించి ఎదుగుదల లక్ష్యంగా ప్రొద్దున్నే అల్పాహారం అందించే తొలిముద్ద కార్యక్రమాన్ని సూపర్వైజర్ నీరజ ఆదేశాల మేరకు మండలంలోని ఆలేరు పరిధి అంగన్వాడి సెంటర్లు స్థానిక ఎంపీపీఎస్ లో ఆ గ్రామ సర్పంచి నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి హెచ్ఎం సైదులు పాష, అంగన్వాడీ టీచర్లతో కలిసి గురువారం ప్రారంభించారు. చిన్నారులకు ఉప్మా, కిచిడి వడ్డించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లోని 3 సం.ల నుంచి 6 సం.ల లోపు ఫ్రీ స్కూల్ చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన ఉదయపు బ్రేక్ ఫాస్ట్ అందించడానికి తొలిముద్ద కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు.చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడం,అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లల హాజరు శాతాన్ని పెంచడం ఈ పథకం లక్ష్యమన్నారు. దీనిని సద్వినియోగపరిచేందుకు చిన్నారుల తల్లిదండ్రులు అంగన్వాడీ టీచర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు అక్తర్, అంగన్వాడీ టీచర్లు కె. మంజుల,దేవకి,సునీత, ఆశా వర్కర్ నీరజ, ఆయాలు,పిల్లలు,తల్లులు, గర్భిణీలు,బాలింతలు పాల్గొన్నారు.