అంబేద్కర్ ఆశయాలే మనకు మార్గదర్శకం..! తాటికొండ రాజయ్య

  జనగామ ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి): భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం జనగామ జిల్లా చౌరస్తాలో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందించిన స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం నేటికీ దేశానికి మార్గదర్శకమని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలే మనకు మార్గదర్శకమని, ఆ ఆశయాలను...