రాజాసాహెబ్ పేటలో హోరెత్తిన వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం: సనమాల రాజుకు బ్రహ్మరథం పట్టిన జనం.. గ్రామాభివృద్ధే నా ధ్యేయం,వంకాయ గుర్తుకు ఓటెయ్యండి!
పోరుమామిళ్ల,నవంబర్ 25 ప్రజావాణి వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రాజాసాహెబ్ పేట గ్రామపంచాయతీ ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సనమాల రాజు సోమవారం గ్రామంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ శ్రేణులు,స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ ప్రచార కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలిరావడంతో రాజాసాహెబ్ పేట వీధులన్నీ వైఎస్సార్సీపీ జెండాలతో,నినాదాలతో హోరెత్తాయి. గ్రామంలోని ప్రతి వీధిలో పర్యటిస్తూ,ప్రజల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ సనమాల రాజు మద్దతును అభ్యర్థించారు.గ్రామాభివృద్ధే ఏకైక...