27న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి…!
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 25: ఈ నెల 27న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జనగామ జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి పర్యటన నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మంత్రి పర్యటనలో భాగంగా...