వెల్గటూర్ అయ్యప్ప ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన అడ్లూరి
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం నుంచి అయ్యస్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. సంక్రాంతి వరకు కొనసాగే ఈ అన్నదాన కార్యక్రమాన్ని మండలంలోని వివిధ గ్రామాల అయ్యప్ప భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి, శ్రీకాంత్, మురళి, పలువురు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.