prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 11:46 am Digital Edition : PRAJA VANI

విజయలక్ష్మి గెలుపు గ్రామ అభివృద్ధికి ఒక మలుపు

విజయలక్ష్మి గెలుపు గ్రామ అభివృద్ధికి ఒక మలుపు

కత్తెర గుర్తుకి ఓటెయ్యండి – గ్రామ అభివృద్ధికి తోడ్పడండి

పెనుగంచిప్రోలు, నవంబర్ 24 మన ప్రజావాణి

గుమ్మడిదూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థి పొన్నం విజయలక్ష్మి, ఆమె భర్త పొన్నం బాలాజీ కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రశాంత వాతావరణం, ప్రజలకు న్యాయం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని వివరించారు.

ఈ సందర్భంగా పొన్నం విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామంలో అవినీతికి తావులేకుండా, గొడవలు లేని ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తానని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని, గ్రామంలోని ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.

ఎన్నికల అధికారి తనకు కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. గ్రామంలో అవినీతిని కత్తిరించి, న్యాయాన్ని గెలిపించాలంటే ప్రతి ఒక్కరూ కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పొన్నం బాలాజీ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆశీస్సులతో గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ముందుకు సాగుతామని తెలిపారు.