వడ్లూరులో వైభవంగా శ్రీ కాలభైరవ స్వామి ప్రతిష్ఠా మహోత్సవ వేడుకలు
వడ్లూరులో వైభవంగా శ్రీ కాలభైరవ స్వామి ప్రతిష్ఠా మహోత్సవ వేడుకలు బెజ్జంకి, నవంబర్ 25 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ప్రతిష్ఠా మహోత్సవాలు రెండో రోజు బుధవారం ఆధ్యాత్మిక శోభతో వైభవంగా కొనసాగాయి. ఉదయం వేదమంత్రోచ్ఛారణల నడుమ మండప దేవతా పూజలు, కాలభైరవ హోమం, ప్రత్యంగిరా మహాహోమం, జనార్దన స్వామి హోమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.హోమాగ్ని ప్రతిష్ఠ, వేదఘోషలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మహోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని...