ముచ్చర్ల వెళ్లే మార్గంలో మృత్యుపాశంగా మారిన మ్యాన్‌హోల్!
ముచ్చర్ల వెళ్లే మార్గంలో మృత్యుపాశంగా మారిన మ్యాన్‌హోల్! ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకోని అధికారులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దంటున్న స్థానికులు తక్షణమే మరమ్మతులు చేపట్టాలి.. స్థానికుడు పులిగారి రాజేష్ విజ్ఞప్తి హసన్‌పర్తి, నవంబర్ 24, మన ప్రజావాణి: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హసన్‌పర్తి నుంచి 1వ డివిజన్ ముచ్చర్ల గ్రామానికి ఓఆర్ఆర్ పక్క నుంచి వెళ్లే ప్రధాన మార్గంలో ప్రమాదకరంగా మారిన మ్యాన్‌హోల్ వాహనదారులు, పాదచారులకు ప్రాణసంకటంగా మారింది. రహదారికి ఆనుకొని ఉన్న ఈ మ్యాన్‌హోల్ చుట్టూ పెద్ద గుంత...