prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 8:15 pm Digital Edition : PRAJA VANI

మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

*మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం*

*చైర్మన్ గా గుర్రాల మల్లేశం, వైస్ చైర్మన్ గా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ*

నర్సాపూర్.నవంబర్ 25 మన ప్రజావాణి నియోజకవర్గం ప్రతినిధి

నర్సాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రతాప్ గౌడ్ నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి వారికి బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్రాల మల్లేశం, వైస్ చైర్మన్ గా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డైరెక్టర్లుగా చెర్యాల శ్రీనివాస్ గుప్తా, మూల హన్మంతు గుప్తా, వేణుగోపాల్ రెడ్డి, విఠల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శివప్రసాద్ గౌడ్, రవి శంకర్, మహ్మద్ రియాజ్ అలీ, మేఘమాల, వీరాగౌడ్, అంజయ్య, రమేష్ తదితరులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.మార్కెట్ కమిటీ అభివృద్ధికి అందరం కలిసి పని చేస్తామని, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.